ములుగు: గోవిందరావుపేట తాసిల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
Mulug, Mulugu | Sep 16, 2025 గోవిందరావుపేట మండలం కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు రైతు సమస్య లను పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించాలని, లక్నవరం చెరువు కింద పదిహేను వేల ఎకరాల వరి ఉంటే మొత్తం యూరియా సెప్టెంబర్ నెలలోనే ఎక్కువ అవసరం ఉంటుందని, ఆ తర్వాత అవసరాలు తక్కువ ఉంటాయని పేర్కొన్నారు.