ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన చెంచులను ఆదుకోవాలని శ్రీశైలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వెంకట శివప్రసాద్ ను చెంచు కమ్యూనిటీ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ అంకారావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంకా రావు మాట్లాడుతూ ప్రకాశం పల్నాడు నంద్యాల జిల్లాలో కూడా తుఫాన్ కారణంగా చెంచుగూడెం లో నివసిస్తున్న కుటుంబాలకు చెందిన పంట పొలాలు నీట మునిగి నష్టం జరిగిందన్నారు.