తాడిపత్రి: రాయల చెరువు జడ్పీ హైస్కూల్ హెచ్ ఎం డేనియల్ పదవీ విరమణ, ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు, గ్రామస్తులు
యాడికి మండలం రాయలచెరువు లోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డేనియల్ మంగళవారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా డేనియల్ ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శ్రీధర్ గౌడ్ మాట్లాడారు. డేనియల్ సుమారు 32 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పని చేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాడన్నారు. శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు.