గజపతినగరం: గజపతినగరం కోపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతుల తోపులాట : పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసుల రంగ ప్రవేశం
గజపతినగరం కోపరేటివ్ సొసైటీ వద్ద సోమవారం మధ్యాహ్నం యూరియా కోసం రైతులు తోపులాటలకు దిగారు. సొసైటీకు యూరియా కోసం పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. సొసైటీ కి యూరియా నిల్వలు తక్కువగా వచ్చిన నేపథ్యంలో యూరియా తమకు దొరుకుతుందో లేదో అని ఆందోళనతో రైతులంతా తోపురాట్లకు దిగారు. పరిస్థితిని చక్క దిద్దేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయినప్పటికీ యూరియా కోసం రైతులు ఎగపడడంతో సొసైటీలోని కుర్చీలు బెంచీలు విరిగిపోయే పరిస్థితి నెలకొంది.