ఎయిడ్స్ వ్యాధి అవగాహన ప్రచార రథం ప్రారంభం చేసిన డిఎంహెచ్వో దేవి
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రెండు నెలలపాటు నిర్వహించే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎల్ఈడి డిస్ ప్లే కలిగిన ప్రచార వాహనాన్ని జిల్లాకు పంపటం జరిగింది. ఎయిడ్స్ వ్యాధి అవగాహన ప్రచార రథం వాహనాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.ఈబి.దేవి నగరంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈ వాహనాన్ని జన సమ్మర్థ ప్రదేశాలలో నిలపాలని, హెచ్.ఐ.వి. ప్రభావిత ప్రాంతాలలో వినియోగించాలని తెలిపారు.