ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా సైరన్ మోగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ.. తక్కువ వేతనంతో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గపు చర్యని పేర్కొన్నారు. జీతాలు రాకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు.