గుత్తి శివారులోని పెద్దవడుగూరు మండల పరిధిలో ఉన్న గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అధ్యాపకులు, విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి అధ్యాపకులు, విద్యార్థులు డాన్స్ చేశారు. సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అనే భావన కలిగింది. కళాశాల ఆవరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.