తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు అయిన ఆదివారం రాత్రి అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడు అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మీకి చంద్రుడు సోదరుడు 16 కలలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు అటువంటి సూర్యప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణాకటాక్షాలు పుష్పవృష్టి లాగా వర్షిస్తాయి.