కుప్పం: బామ్మర్దిని కాపాడబోయి మామ మృతి
రామకుప్పం మండలంలోని కోటచేనులో పశువును కడుగుతూ ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. వీర్నమల పంచాయతీ కుల్లగానూరుకు చెందిన రామ్మూర్తి కుమారుడు సతీష్ (16) కోటచేనులోని తన అవ్వను చూసేందుకు ఆదివారం గ్రామానికి వచ్చాడు. అయితే సోమవారం తన మామ గోవిందరాజులుతో కలిసి పశువులను శుభ్రం చేసేందుకు చెరువులో దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఈ క్రమంలో బామ్మర్దిని కాపాడబోయి మామ గోవిందరాజులు సైతం మృతి చెందాడు.