మౌన నిరాహార దీక్ష చేస్తున్న వేడమ్ గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు
మౌన నిరాహార దీక్ష చేస్తున్న వేడo విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు వేడాo గ్రామం పెద్ద మిట్టకండ్రిగ వేదాం ఎంపీపీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు శ్రీకాళహస్తి పట్నంలోని ఎంపీడీవో, ఎంఈఓ కార్యాలయాల ప్రాంగణంలో ఈరోజు మౌన నిరాహార దీక్ష చేశారు. వాన సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగించారు. ముందుగా గ్రామంలోని స్కూల్ కు తాళాలు వేసి దీక్షలో కూర్చున్నారు. తక్షణం శ్రీకాళహస్తి ఎంపీడీవో పెంచల శ్యామ్ మరియు ఎంఈఓ బాలయ్య గారు స్పందించి గ్రామ ప్రజల నుంచి అర్జీని స్వీకరించి సంబంధిత అధికారులకు తెలుపుతామని, చెప్పారు