పత్తికొండ: వెల్దుర్తి లో ఆటో కార్మికుల నిరసన జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలి డిమాండ్
కర్నూలు జిల్లా వెల్దుర్తి పాత బస్టాండ్ వద్ద సోమవారం ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలని, వాహనమిత్ర పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు నెలకు రూ. 5000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ స్టాండ్లకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.