కుప్పం: గ్రామానికి 10 బెల్ట్ షాపులు: MLC భరత్
కుప్పం నియోజకవర్గంలో ఒక్కో గ్రామానికి పదికి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ భరత్ ఆరోపించారు. కల్తీ మద్యం, గ్రామాల్లో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులతో కలిసి ఎక్సైజ్ సీఐ నాగరాజుకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఎక్సైజ్ పోలీసులు సహకరిస్తే ఇవాళే 1000 బెల్టు షాపులు పట్టిస్తామని వైసీపీ మండలాధ్యక్షుడు మురుగేశ్ పేర్కొన్నారు.