మార్కాపురం: పొదిలి నుండి పాకల బీచ్ కి ప్రత్యేక ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన డిపో మేనేజర్ శంకర్రావు
ప్రకాశం జిల్లా పొదిలి నుండి పాకల బీచ్ నకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 7:15, 8:15, 9:15, 10:15 గంటలకు మధ్యాహ్నం 1:45, 2:45 గంటలకు బస్ సర్వీసు నడుపుతున్నట్లు తెలిపారు. పెద్దలకు బస్ ఛార్జి ₹100 పిల్లలకు 50 రూపాయలు మాత్రమేనన్నారు. సముద్రం వద్ద సరదాగా గడపాలనుకున్న ప్రయాణికులకు నీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు