భారీ వర్షాల కారణంగా రేణిగుంట లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి
రేణిగుంటలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు రేణిగుంట మండల పరిధిలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని MRO చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మండలంలో ఎక్కడైనా ఇళ్లు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, వాగులు లేదా వంతెనలు పొంగితే వెంటనే 8328336598 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.