కదిరిలో వైద్యులు వైద్య సిబ్బందిపై దాడి ఘటనలో మరికొందరు అరెస్ట్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఆగస్టు నెల 27వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కలిసి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల మేరకు ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, మరికొంత మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం మూడు కేసులను నమోదు చేసినట్టుగా తెలియజేశారు.