బేతంచర్ల లో ఫీస్ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థి సంఘాల ధర్నా
Dhone, Nandyal | Sep 22, 2025 నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని కళాశాలల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు ఉదయ్, మధు, శేఖర్, కొంతమంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇంకా మంజూరు కాలేదని తెలిపారు. సమస్యపై వినతిపత్రం డీటీ మారుతికి సమర్పించారు.