అనంతపురం జిల్లా నర్సనాయని కుంట గ్రామంలో కుటుంబంపై సమీప బంధువు హత్యాయత్నం
Anantapur Urban, Anantapur | Nov 10, 2025
అనంతపురం జిల్లా నరస నాయుడు కుంట గ్రామంలో లక్ష్మన్న నాయక్ కుల్లాయమ్మబాయి లక్ష్మీబాయి అనే వారిపై వారి సమీప బంధువు నాను నాయక్ హత్యాయత్నం చేసినట్లు బాధితులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తమ ఇంటికి వచ్చినా అతను తాము తినే ఆహార పదార్థాలలో ఏదో కలిపి వెళ్లాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మధ్యాహ్నం అన్నం తిన్నప్పటినుంచి తమకు వాంతులు విరేచనాలు అవుతున్నాయని తెలిపారు.