పరిగి: పూడూరు మండలం రేడియల్ రింగ్ రోడ్డు బాధితులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందజేత
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పరిధిలో గల రేడియల్ రింగ్ రోడ్డు బాధితులు గురువారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలిసి రైతులు పలు అంశాలను తెలియజేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రేడియల్ రింగ్ రోడ్డు లో భూమిని కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అధికారులతో సమన్వయం చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.