గజపతినగరం: కొటారుబిల్లిలో తహసిల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తుతో రైతులకు యూరియా పంపిణీ
గంట్యాడ మండలంకొటారుబిల్లి రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం తహసీల్దారు నీలకంటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తుతో రైతులకు యూరియా ను పంపిణీ చేశారు పలు గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో రైత్సవ కేంద్రానికి యూరియా కోసం తరలివచ్చారు. తాసిల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు రైతులందరినీ వరుస క్రమంలో క్యూలో నిలబెట్టారు. క్యూలో ఉన్న రైతులందరికీ మంచినీటి సదుపాయాన్ని తహసిల్దార్ ఏర్పాటు చేశారు.