అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధిలో యోగాంధ్ర కార్యక్రమం, పాల్గొన్న ఆలయ అధికారులు, సిబ్బంది
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమం లో భాగంగా ప్రసిద్ధ అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తరగతుల్లో ఆలయ అధికారులు, సిబ్బంది యోగ గురువుల పర్యవేక్షణలో యోగా సాధన చేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను గురువులు వివరించగా, స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు.