రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి కురిసిన వర్షానికి కూలిన ప్రహరీ
రేణిగుంటలో కూలిన రైల్వే ప్రహరీ రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రహరీ సోమవారం రాత్రి కురిపిన వర్షానికి కూలిపోయింది. గోడకు ఆనుకొని ఉన్న రెండు ఇళ్లలోని బాత్ రూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. గోడ కూలిన సమయంలో ఎవరూ ఇళ్లలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు ప్రహరీ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.