గుంతకల్లు: పట్టణ శివారు భీమిరెడ్డి కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ, 3 తులాల బంగారు, 10 తులాల వెండి అపహరణ
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని భీమిరెడ్డి కాలనీలో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి తాళం బద్దలు కొట్టి భారీ చోరీకి తెగబడ్డారు. గుంతకల్లు రూరల్ పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారులో భీమిరెడ్డి కాలనీలో ఉండే బొలికొండ పని మీద కుటుంబసభ్యులతో హిందూపురంకు వెళ్ళాడు. అయితే ఆదివారం రాత్రి ఆలస్యంగా గుంతకల్లుకు వచ్చి సమీపంలోని అత్త ఇంట్లో నిద్రించారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు పక్కనే ఉన్న పిట్ట గోడ దూకి ఇంటి తాళాలు బద్దలు ఇంట్లోని బీరువాలో ఉన్న 3 తులాల బంగారు, 10 తులాల వెండి చోరీ చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.