పేదల సొంటింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత
పెనుకొండ మండలం అర్బన్ కాలనీలో మంత్రి సవిత బుధవారం గృహ నిర్మాణాల కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో సగంలో నిలిచిపోయిన పనులను తామే పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.