గుంతకల్లు: గుత్తిలోని అంబేద్కర్ కాలనీలో రామచంద్ర అనే వ్యక్తిపై ఓ గుర్తు తెలియని యువకుడు దాడి, ఆసుపత్రికి తరలింపు
గుత్తిలోని అంబేద్కర్ కాలనీలో నివాసముండే రామచంద్ర అనే వ్యక్తిపై ఓ గుర్తుతెలియని యువకుడు అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రామచంద్ర ఇంటి వద్ద ఉండగా కర్ర తీసుకొని ఇష్టానుసారం కొట్టాడు. స్థానికులు రావడంతో ఆ యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే రామచంద్రను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.