అనంతపురం జిల్లా సింగనమల లో పోలీసులకు వ్యతిరేకంగా నిరసన
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం సింగనమల మండల కేంద్రంలో పోలీసులకు వ్యతిరేకంగా నాగుల గూడెం తాండకు చెందిన గ్రామస్తులు నిరసనను వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదివారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. సోమవారం ఉదయం రామకృష్ణ నాయక్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో కొట్టారని దీంతో అతను సింగనమల ఆసుపత్రిలో మృతి చెందినట్లు వారు తెలిపారు. పోలీసుల వైఖరితోనే మృతి చెందినట్లుగా మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.