ఆందోల్: ఆందోల్ ఎంపీడీవో కార్యాలయం ముందు బైక్‌ని ఢీకొన్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు, అక్సాన్పల్లికి చెందిన మల్లేశం అనే వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈరోజు బుధవారం 12 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ కు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో అక్సాన్పల్లికి చెందిన మల్లేశం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. నారాయణఖేడ్ నుంచి జోగిపేట మీదుగా సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న అక్సాన్‌పల్లి గ్రామానికి చెందిన మల్లేశంను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.