మహబూబ్ నగర్ అర్బన్: అమరచింత: కృష్ణా నదికి చేరుతున్న వరద నీరు, ఆనందంలో ఉమ్మడి జిల్లా రైతులు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న కృష్ణానదికి వరద జలాలు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి నీరు చేరడంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వరుసగా పడుతున్న వానలకు కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతోంది. దీనితో ఈ ఏడాది నదికి ఆశించిన మేర వరద జలాలు చేరుతాయని ఆశిస్తున్నారు.