సుప్రీం కోర్ట్ సి జె ఐ పై దాడి అమానుషం :CITU
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ గవాయిపై అడ్వకేట్ కిషోర్ చేసిన దాడిని రైల్వే కోడూరు సిఐటియు :నా యకులు తీవ్రంగా ఖండించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్, మండల కార్యదర్శి పి. జాన్ ప్రసాద్, కోశాధికారి హరి నారాయణ మాట్లాడుతూ, రాజ్యాంగ పరంగా తీర్పులు ఇస్తున్న సుప్రీంకోర్టు సీజేపై దాడి చేయడం మతతత్వ ఉన్మాదానికి నిదర్శనమని తెలిపారు. దళిత న్యాయమూర్తిగా ఉన్నందుకే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారిపై కఠినంగా శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.