ప్రొద్దుటూరు: తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Proddatur, YSR | Oct 30, 2025 రాష్ట్రంలో తుఫాను వల్ల రైతులు తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చిందని, ఈ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పూర్తిస్థాయిలో ఆదుకోవాలని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంపై 2024 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు తుఫాను విరుచుకు పడిందని, ఇప్పటివరకు నష్టపోయిన రైతులకు ఏ ఒక్కరికి చంద్రబాబు నాయుడు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఈ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతులకు 100% సబ్సిడీతో విత్తనాలు అందించి, నష్టపోయిన పంటకు కూడా పూర్తిస్థాయి నష్టపరిహారం అందించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్