మచిలీపట్నంలో ఆస్తులను పరిరక్షిస్తూ.. ఆదాయం పెంచేలా చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర
Machilipatnam South, Krishna | Sep 14, 2025
మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి ఆలయానికి గొల్లపూడిలో ఉన్న ఆస్తులను పరిరక్షించడంతో పాటు, ఆలయానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. గొడుగుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి భూముల ద్వారా ఆదాయం లేకుండా పోయిందని, వైబ్రేంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల ఎగ్జిబిషన్ నిర్వహణకు అవసరమైన స్థలాన్ని వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.