కొవ్వూరు: కొడవలూరు మండలంలో పూర్తిగా నీట మునిగిన.. టపాతోపు అండర్ బ్రిడ్జి..!
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొడవలూరు మండలం, టపాతోపు అండర్ బ్రిడ్జిలో నీరు చేరింది. దీంతో అటువైపు వెళ్లే ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. టపాతోపు గేటు అండర్ బ్రిడ్జిలో నీరు చేరడంతో, వాహనదారుల రద్దీ మొత్తం కొడవలూరు రైల్వే గేటుపై పడింది. దీంతో కొడవలూరు రైల్వే గేటు వద్ద వత్తిడి పెరిగి.. ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.