ఒంగోలు పట్టణంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం, విద్యార్థులకు అవగాహన
Ongole Urban, Prakasam | Oct 31, 2025
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు పట్టణంలో పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు ఉపయోగించే ఆయుధాలను ప్రదర్శనగా ఉంచి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలిపారు. విద్యార్థులు పోలీసులు ఏర్పాటుచేసిన ఓపన్ హౌస్ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూశారు.