మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును భారత్ మహిళల జట్టు చిత్తు చేసి విశ్వ విజేతగా నిలవడంతో తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మహిళా ప్రజాప్రతినిధులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను చేత పట్టుకొని జై భారత్ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా అస్మిత్ రెడ్డి మాట్లాడారు. ఉమెన్స్ వరల్డ్ కప్ ను మొదటిసారిగా ఇండియా గెలవడంతో తనకెంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారు.