పెనుకొండలో ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం అంబేడ్కర్ సర్కిల్లో ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెనుకొండ మండల ఏఐఎస్ఎ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తూ, విద్యార్థుల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఒక నల్ల జీవోను తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల స్వేచ్ఛకు భంగం కలిగించే జివోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.