తాడిపత్రి: యాడికి కుంట వీధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు, మద్యం బెల్టు షాప్ నిర్వాహకుడు అరెస్ట్, 15 మద్యం బాటిళ్లు స్వాధీనం
యాడికి మండల కేంద్రంలోని కుంట వీధిలో సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గురువారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కుంట వీధిలోని ఓ ఇంటిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాప్ నిర్వాకుడు రవితేజను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.అతని వద్ద నుంచి 15 మద్యం బాటిళ్ల ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటన పై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు.