తొట్టంబేడు సింగిల్ విండో కార్యాలయంలో తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ ప్రమాణస్వీకారం
తంగేళ్లపాలెం సింగిల్ విండో ఛైర్మన్ ప్రమాణ స్వీకారం తొట్టంబేడు (M) తంగేళ్లపాలెం సింగిల్ విండో ఛైర్మన్గా భీమాల భాస్కర్ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మంగళవారం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్య క్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ అతిథిగా వచ్చారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు లభిస్తాయని తెలిపారు. కమిటీ సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.