ముధోల్: భైంసాలో కార్డెన్ సెర్చ్....భారీగా వాహనాలు సీజ్
Mudhole, Nirmal | Sep 18, 2025 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని జుల్ఫకర్ గల్లీ , బట్టి గల్లిలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 115 బైక్ లు, 2 కార్లు , 3 ఆటోలు సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీసు శాఖ నిరంతరం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుందని ఏఎస్పీ తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు....ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.