కర్నూలు: మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూ ఛార్జీలు పెంచి కనీసం వేతనం చెల్లించాలి: సిఐటియు కర్నూలు జిల్లా నాయకులు గోపాల్
మధ్యాహ్న భోజన కార్మికుల మెనూ చార్జీలు పెంచాలి కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు కర్నూలు జిల్లా నాయకులు గోపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కార్మిక కర్షక భవన్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ విద్యార్థులకు ఇస్తున్న మెనూ ఛార్జీలు సరిపోక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు కూరగాయలు ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయని తిండి గింజల ధరలు కూడా స్థిరంగా లేవని దీంతో వంట కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారని తెలిపారు.