తాడిపత్రి: యాడికి లో ఐచర్ వాహనంతో పాటు 9 టన్నుల సండ్ర కలపను పట్టుకున్న పోలీసులు
యాడికిలో మంగళవారం సీఐ వీరన్న పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల నుంచి మహారాష్ట్రకు ఐచర్ లో తరలిస్తున్న 9 టన్నుల సండ్ర కలప ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మొదట ఎర్రచందనంగా భావించారు. అయితే ఫారెస్ట్ అధికారులు సండ్ర కలపగా నిర్ధారించారు. పోలీసులు ఐచర్ వాహనంతో పాటు సండ్ర కలపను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.