రామగుండం: బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న మాజీ కార్పొరేటర్ భర్త నగునూరి రాజు : మున్సిపల్ కాంట్రాక్టర్లు
మా ఉపాధి కోల్పోవడానికి కావాలని మాపై దుస్పచారం చేస్తున్న మాజీ కార్పొరేటర్ భర్త నగునూరి రాజు తీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్ల కుమ్ముకయ్యారని ఆరోపించిన నగునూరి రాజు మాటలను ఖండించారు. మున్సిపల్ కాంట్రాక్ట్రు లు కృపాకర్, రజనీకాంత్, సాంబమూర్తి, విశ్వతేజ, ప్రతాప్ రెడ్డి, రమేశ్, సదానందం, శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.