ఏలూరు జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శివ కిషోర్ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 60 ఫిర్యాదులు వచ్చాయని న్యాయపరంగా విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ శివకిషోర్ తెలిపారు..