నెల్లూరు కోటమిట్టలో విషాదం, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి
ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఈతకు వెళ్లి నెల్లూరులోని కోటమిట్టకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. ఉమయున్ , సమీద్ లు మరో ఫ్రెండ్ తో కలిసి ఆదివారం కావడంతో మైపాడు బీచ్ కి వెళ్లారు. అలల ఉధృతికి గల్లంతయ్యారు. దీంతో ముగ్గురు స్నేహితుల మృతదేహాలను పోలీసులు బయటికి తీశారు. కోటమిట్టకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.