జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నియంత్రించేందుకు బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించారు.ఈ తనిఖీలలో బ్రీత్ అనలైజర్ పరికరాల సహాయంతో వాహనదారులను పరీక్షించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల ప్రాణాలు రక్షించడం ఈ* చర్యల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.