ఉదయగిరి: దసరా నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా సర్వరబాద్ లో శ్రీ తులసి భవాని మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు
దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఉదయగిరి మండలం నేలటూరి పంచాయతీ సర్వరాబాద్ గ్రామంలో శ్రీ తులసి భవాని మాత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పిల్లలు, పెద్దలు కలిసి ఆడిన పండరి భజన పలువురిని ఆకట్టుకుంది.