బీడి అడిగినందుకు వ్యక్తిపై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం కొత్తచెదుళ్ళ గ్రామంలో చోటుచేసుకుంది. సురేష్ అనే వ్యక్తిపై ఎల్లప్ప దాడి చేసి గాయపరిచారు. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.