ఉప్పల్: ఘట్‌కేసర్ రోడ్డును పరిశీలించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
శుక్రవారం రోజున ఉప్పల్ చౌరస్తా నుండి పీర్జాదిగూడ మీదుగా ఘట్కేసర్ రింగ్ రోడ్డు వరకు గల రోడ్డును మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి వందల కోట్లు మంజూరు చేస్తే కాంట్రాక్టర్ దివాలా తీసి సతాయిస్తున్నాడు. కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య వల్ల, బిటి రోడ్ ఫార్మేషన్ కాకపోవడం వల్ల,కొన్ని రోజులు కాంట్రాక్టర్, అధికారులు కోర్టుకు వెళ్లి సతాయిస్తున్నారని వినాయక చవితి లోపు రోడ్డు పనులను పూర్తిచేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.