మేడ్చల్: గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరి మృతి
గుండ్లపోచపల్లి మున్సిపల్ పరిధిలో ఆదివారం కురిసిన వర్షానికి వీ కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ సోమవారం కూలింది. గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా షెడ్లపై గోడకులే నిద్రిస్తున్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.