పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం లో పత్తి రైతులు ఆందోళన వర్షానికి తడిచిన పత్తి
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షానికి పత్తి పంట రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంట నేలకొరిగి తడిసి ముద్దయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో తడిసిన పత్తి పంట ధర లేకపోవడంతో రైతులబోధిపోమంటున్నారు. పత్తి పంట తీయడానికి కూలీకి కిలో పత్తి 15 రూపాయలు పలుకుతుందంటూ రైతులు గురువారం తెలిపారు.