తాడిపత్రి: వాహన మిత్ర పథకంలో ఎవరికి నష్టం రాకుండా చూడాలని అధికారులకు సూచించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి
వాహన మిత్ర పథకంలో ఏ ఒక్కరికీ నష్టం రాకుండా చూడాలని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. అధికారులు, సిబ్బందితో వాహన మిత్ర పథకంపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ దరఖాస్తుల ప్రక్రియ, అర్హతలపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులు నష్టపోకుండా చూడాలని అధికారులకు జేసీ సూచించారు. పథకం సక్రమంగా అమలు చేయాలన్నారు.