నవంబర్ 1న చంద్రబాబు పర్యటనపై హెలీపాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నవంబర్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లు గురువారం సాయంత్రం హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు వారు పలు సూచనలు చేశారు.